: తిరుపతిలో రెచ్చిపోయిన‌ ఆకతాయిలు... అడ్డొచ్చిన యువకుడిపై దాడి


తిరుపతిలో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. తాము ఈవ్‌టీజింగ్ చేస్తుండ‌గా అడ్డుకున్న ఓ యువ‌కుడిపై దారుణంగా దాడి చేశారు. తిలక్‌రోడ్డుకు చెందిన ప‌లువురు ఆక‌తాయిలు ఇటీవ‌ల ఈవ్‌టీజింగ్ చేస్తుండ‌గా అదే ప్రాంతానికి చెందిన ఓంకార్‌రెడ్డి వారిని హెచ్చ‌రించారు. దీంతో ఆగ్ర‌హించిన వారు ఓంకార్‌రెడ్డిని హ‌త‌మార్చ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న‌పై పెప్పర్ స్ప్రే చల్లారు. అనంత‌రం త‌మ‌తో తెచ్చుకున్న‌ రాడ్‌లతో కొట్టారు. తీవ్రంగా గాయ‌ప‌డిన యువ‌కుడు ద‌గ్గ‌ర‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు.

  • Loading...

More Telugu News