: ‘డెంగ్యూ’తో హైదరాబాద్ యువ క్రికెటర్ సాయినాథ్ మృతి


డెంగ్యూ వ్యాధితో హైదరాబాద్ కు చెందిన యువ క్రికెటర్ సాయినాథ్ మృతి చెందాడు. బోడుప్పల్ లోని శ్రీసాయినగర్ కాలనీకి చెందిన సాయినాథ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అండర్-19 జట్టులో సభ్యుడు. మూడురోజుల క్రితం అతనికి జ్వరం రావడంతో ఉప్పల్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అతని బంధువులు, మిత్రులు బోడుప్పల్ చేరుకున్నారు. శ్రీసాయినగర్ కాలనీ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఈ విషయమై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News