: దమ్ముంటే ఎన్నికలకు వెళ్లండి: చంద్రబాబుకి సవాలు విసిరిన అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీపై విమర్శలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమ పార్టీని అవసరమా? అని అంటున్నారని, దమ్ముంటే ఎన్నికలకు వెళితే, తాము అవసరమో కాదో ప్రజలే తేలుస్తారని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు తాను ఇరుక్కున్న అన్ని కేసుల్లోను స్టే తెచ్చుకుంటారని అంబటి రాంబాబు అన్నారు. వైసీపీ ఉంటే టీడీపీకి పుట్టగతులుండవనే బాబుకు భయం పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు సంపాదించాలన్న పిచ్చి చంద్రబాబుకి పట్టిందని ఆయన ఆరోపించారు. తాము రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడడం లేదని, అభివృద్ధి పేరుతో చేస్తోన్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.