: మేము తప్పుచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి
నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాము తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ఆయన అన్నారు. నయీమ్‌తో తమకెలాంటి సంబంధం లేదని చెప్పారు. సీబీఐకి అప్పగిస్తేనే దోషులెవరో బయటపడతారని ఆయన అన్నారు. రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రౌడీయిజం, సెటిల్‌మెంట్‌ల వంటి సంఘ వ్యతిరేక చర్యలకు కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యతిరేకమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమని చంపుతామంటూ గతంలో దుండగుల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని ఆయన చెప్పారు. బెదిరింపులపై ఈ ఏడాది జనవరిలో ఐజీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నయీమ్ కేసును తప్పుదోవ పట్టించేందుకు పలువురు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు.