: హైదరాబాద్లో కలకలం.. నలుగురు బాలికల అదృశ్యం
హైదరాబాద్లో నలుగురు బాలికలు అదృశ్యమయిన ఘటన కలకలం రేపుతోంది. నగరంలోని చిక్కడపల్లిలో నివసిస్తోన్న రుచిత (13), పావని(13), గాయత్రి (15), దివ్య(15) అనే నలుగురు బాలికలు నిన్న సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. తమ పిల్లలు అదృశ్యమయ్యారని సదరు బాలికల తల్లిదండ్రులు ఈ రోజు ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికల ఆచూకీ తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు పరిశీలించనున్నట్లు సమాచారం.