: మోదీ బర్త్ డే నాడు రికార్డుల హోరు.. గిన్నిస్ రికార్డులు నెలకొల్పాలని గుజరాత్ సర్కారు నిర్ణయం


ప్రధాని నరేంద్రమోదీ 66వ జన్మదినం సందర్భంగా ఈనెల 17న గిన్నిస్ రికార్డులు నెలకొల్పాలని గుజరాత్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో 11,223 మంది వికలాంగులకు 17వేల చక్రాల కుర్చీలు, మూడు చక్రాల సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. అలాగే వికలాంగులతో అతి పెద్ద లోగోను ఏర్పాటు చేసి రికార్డు నెలకొల్పనున్నారు. వినికిడి లోపం ఉన్న వేయిమందికి వినికిడి సాధనాలను పంపిణీ చేసి మరో రికార్డు నెలకొల్పాలని సర్కారు నిర్ణయించింది. అలాగే 15 వందల దీపాలను ఒకేచోట వెలిగించి మరో రికార్డును నెలకొల్పనుంది. ఇలా మోదీ జన్మదినాన్ని మొత్తం రికార్డుల మయంగా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • Loading...

More Telugu News