: మాల్యా... నువ్వు రావాలనుకుంటే మార్గమిదే!


తనకు భారత్ రావాలని ఉన్నప్పటికీ, పాస్ పోర్టును రద్దు చేయడం వల్ల రాలేకపోతున్నానని విజయ్ మాల్యా వ్యాఖ్యానించిన నేపథ్యంలో విదేశాంగ శాఖ స్పందించింది. ఆయన నిజంగా రావాలని భావిస్తే, అందుకు ప్రత్యామ్నాయం ఉందని, సమీపంలోని ఇండియన్ ఎంబసీకి వెళ్లి ఎమర్జెన్సీ సర్టిఫికెట్ పొందవచ్చని సూచించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేస్తూ, విదేశాల్లోని భారత పౌరులు ఎవరైనా సరైన పత్రాలు లేకుంటే అత్యవసర ధ్రువీకరణ పత్రాలు పొందవచ్చని, అదే సదుపాయం మాల్యాకూ వర్తిస్తుందని తెలిపారు. కాగా, మాల్యా ఇండియా నుంచి పారిపోయిన తరువాత ఆయన పాస్ పోర్టును రద్దు చేయాలని ఈడీ కోరగా, హోం శాఖ దాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News