: వారి తోక కట్ చేస్తా.. ప్రతిపక్షంపై చంద్రబాబు ఫైర్


రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలనుకునే వారిని ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. విజయవాడలో దేవినేని నెహ్రూ టీడీపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. కాకినాడలో రూ.500 కోట్ల పెట్టుబడితో దివీస్ సంస్థ ఫ్యాక్టరీ పెట్టేందుకు ముందుకొస్తే ప్రతిపక్షం తమ ఎమ్మెల్యేను పంపి అడ్డుపడుతోందని విమర్శించారు. అటువంటి వారి తోక కట్ చేసి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రజలందరూ సంతృప్తిగా ఉండాలనేదే తన లక్ష్యమన్నారు. విపక్షంలో ఉన్న మంచి వ్యక్తులు పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అందరూ సహకారం అందిస్తే పదేళ్లలో పూర్తి చేయాలనుకున్న పనిని నాలుగైదేళ్లలోనే పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఒక్క రోజు వర్షం కురిస్తే 59 టీఎంసీల నీరు జమ అవుతుందని, అలాంటిది కేవలం 14 టీఎంసీల కోసం కర్ణాటక, తమిళనాడు మధ్య చిచ్చు రేగడం బాధాకరమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News