: నిమజ్జన వేడుకల్లో విషాదం.. కరెంటు వైర్లు తగిలి షాక్.. ఇద్దరి మృతి
హైదరాబాద్‌లోని చంపాపేటలో ఈరోజు వినాయక నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని రెడ్డి కాలనీ సమీపంలో నిమజ్జనం కోసం వినాయకుడి విగ్రహాన్ని ట్రాక్టర్‌లో తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినాయకుడి ఊరేగింపులో పాల్గొంటున్న ఇద్దరు వ్యక్తులకు కరెంటు వైర్లు తగిలాయి. దీంతో విద్యుదాఘాతానికి గురై వారు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను శవపరీక్షల కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తులను న్యాయవాది వెంకటేశ్వర్లు, సరూర్‌నగర్ ప్రాంత వాసి సందీప్‌లుగా గుర్తించారు.