: ఎన్టీఆర్ క్యాంటీన్ లో భోజనం చాలా బాగుంది: పరిటాల సునీత
వెలగపూడిలోని ఎన్టీఆర్ క్యాంటీన్ లో భోజనం చాలా బాగుందని ఏపీ మంత్రి పరిటాల సునీత ప్రశంసించారు. క్యాంటీన్ లో భోజనం రుచి చూసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ క్యాంటీన్ లో నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారని, ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ క్యాంటీన్ ల సంఖ్యను పెంచుతామని ఆమె తెలిపారు.