: రంగారెడ్డి జిల్లాలో భారీ వర్షానికి 'కాగ్నా' ఉగ్రరూపం, కొట్టుకుపోయిన బ్రిడ్జి


రంగారెడ్డి జిల్లాలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కాగ్నా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ప్రవాహ ఉద్ధృతికి తాండూరు వద్ద వంతెన కొట్టుకుపోగా, తాండూరు - మహబూబ్ నగర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్, తాండూరు పరిసర ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఈ సంవత్సరం ఇదే అత్యధిక వర్షమని అధికారులు తెలిపారు. హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గడచిన మూడు రోజుల నుంచి ఆగి ఆగి వర్షాలు పడుతున్నాయి.

  • Loading...

More Telugu News