: ఏడేళ్ల నాటి కేసులో బాలకృష్ణపై విచారణ నిలిపివేస్తూ జీవో జారీ చేసిన ఏపీ సర్కారు
టాలీవుడ్ హీరో, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ఏడేళ్ల క్రితం నరసరావుపేటలో నమోదైన కేసులో విచారణను నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నరసరావుపేట నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కోడెల శివప్రసాద్ నిలబడగా, ఆయన తరఫున ప్రచారం చేసేందుకు బాలకృష్ణ వచ్చారు. ఆ సమయంలో పోలీస్ యాక్ట్ అమలులో ఉండగా, నిబంధనలను అతిక్రమించి సభ, ర్యాలీ నిర్వహించినందుకు బాలకృష్ణతో పాటు కోడెల, ఆయన కుమారుడు శివరామకృష్ణ, మోదుగుల వేణుగోపాల్ తదితర 15 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ను నిలిపివేయాలని రాష్ట్ర డీజీపీ ఆదేశాలు ఇవ్వడంతో, ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఆర్ అనురాధ జీవో నంబరు 122ను విడుదల చేశారు.