: పాకిస్థాన్ లో అవామీ ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొన్న గూడ్స్


పాకిస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముల్తాన్ సమీపంలో ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా వచ్చిన ఓ రైలు, గూడ్స్ ఢీకొన్నాయి. పెషావర్ నుంచి కరాచీ వెళుతున్న అవామీ ఎక్స్ ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 150 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిని అధికారులు, పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాద ఘటనను తెలుసుకున్న వెంటనే అధికారులు స్పందించారని, సహాయక చర్యలు చురుకుగా సాగుతున్నాయని పాక ప్రభుత్వం ప్రకటించింది.

  • Loading...

More Telugu News