: నాకు పుట్టే పిల్లలూ సినిమాల్లోకి: అనుష్క


తనకు వివాహమైన తరువాత పుట్టే పిల్లలు పెరిగి సినిమా రంగంలోకి వెళ్తామని చెబితే, అందుకు సంతోషంగా అంగీకరిస్తానని అందాల నటి అనుష్క చెబుతోంది. అన్ని రంగాల్లో ఉన్నట్టే సినిమా రంగంలో సైతం మంచీచెడులు ఉన్నాయని, వేసే అడుగులు మనం తీసుకునే నిర్ణయాలపైనే ఏవైనా ఆధారపడి ఉంటాయని అంటోంది. సినిమా రంగంపై మీ అభిప్రాయం ఏంటని అడిగిన వేళ, తాను చిత్రసీమలోకి ప్రవేశించిన తొలినాళ్లలో సైతం ఎవరూ ఇబ్బంది పెట్టలేదని, అత్యంత సురక్షితమైన రంగాల్లో సినిమా ఫీల్డ్ ఒకటని తాను బల్లగుద్ది చెప్పగలనని అంటోంది. సినిమా రంగంపై ఒక్కొక్కరి అభిప్రాయాలను వింటుంటే తనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందని ఈ 'బాహుబలి' దేవసేన చెబుతోంది. తనకు ఎదురైన మంచి, చెడులకు తానే కారణమని, మరొకరిని కారణమని చెప్పబోనని నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News