: క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల అనర్హతపై సుప్రీంకోర్టులో పిల్


క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల అనర్హతపై సుప్రీంకోర్టులో ఈరోజు ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. వారిపై ఉన్న‌ కేసుల విచారణ కోసం దేశంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ పిల్ వేశారు. దీనిపై వాద‌న‌లు విన్న అత్యున్న‌త న్యాయ‌స్థానం కేంద్రంతో పాటు కేంద్ర‌ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యంలో పిటిష‌న‌ర్ పేర్కొన్న అంశాలపై త‌మ‌కు వివ‌రించాల‌ని ఆదేశించింది.

  • Loading...

More Telugu News