: కర్నూలు కొండజూటూరులో తీవ్ర ఉద్రిక్తత.. నానోకెమిక‌ల్ ప్యాక్ట‌రీ యజమానిపై గ్రామస్తుల దాడి


కర్నూలు జిల్లా పాణ్యం మండలం కొండజూటూరులో ఈరోజు తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఆ ప్రాంతంలో ఈరోజు నానోకెమిక‌ల్ ప్యాక్ట‌రీ నిర్మాణంపై ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే ఈ కార్య‌క్ర‌మం ర‌సాభాస‌గా మారింది. ఫ్యాక్టరీ య‌జ‌మాని శాంతిరాంపై స‌దరు గ్రామ‌స్తులంతా క‌లిసి రాళ్ల‌దాడికి దిగారు. దీంతో ఆయ‌న కారు ధ్వంస‌మైంది. అభిప్రాయ‌సేక‌ర‌ణ కోసం వ‌చ్చిన క‌లెక్ట‌ర్‌ను కూడా గ్రామస్తులు అడ్డుకున్నారు. వేరే కారులో శాంతిరాం అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌కుండా పోలీసులు క‌ట్ట‌డిచేశారు.

  • Loading...

More Telugu News