: మెగాస్టార్ చిరంజీవితో కలిసి నేను హాట్ సీట్‌లో అతిధిగా కూర్చుంటా: కింగ్ నాగార్జున
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే బుల్లితెరపై సందడి చేయనున్నారు. ఇంతవరకూ వచ్చిన మూడు సీజన్లలో కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో ఇకపై చిరు కనిపించనున్నారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ‘ఖైదీ నంబర్ 150’ సినిమా షూటింగ్‌తో ఓ వైపు చిరు బిజీబిజీగా ఉంటూనే, మరోపక్క ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నాగార్జున కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తన ఇద్దరబ్బాయిల సినిమాల పనులుండడంతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం నుంచి తప్పుకుంటానని తాను ముందే చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంని ఇకపై మెగాస్టార్ చిరంజీవి నిర్వహించనున్నట్లు తెలిపారు. చిరుతో కలిసి తాను హాట్ సీట్‌లో అతిధిగా కూర్చుంటానని నాగ్ అన్నారు.