: ‘వోల్వో’ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కారు.. భారత్ లో ప్రవేశపెట్టిన సంస్థ


విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ‘వోల్వో’, భారత్ లో లగ్జరీ ఎస్ యూవీని ప్రవేశపెట్టింది. ‘వోల్వో’ చరిత్రలో అత్యంత విలాసవంతమైన, అతి ఖరీదైన కారు ఇదే. వోల్వో ఎక్స్ సీ90 టీ8 ఎక్స్ లెన్స్ హైబ్రిడ్ గా ఈ కారుకు నామకరణం చేసింది. ఈ కారు ఢిల్లీ ఎక్స్ షోరూం ధర రూ.1.25 కోట్లుగా సంస్థ నిర్ణయించింది. నాలుగు సీట్ల వేరియంట్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, లక్సెంబర్గ్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. టీ8 పెట్రోల్ వర్షన్ లో మాత్రమే ఈ కారు నడుస్తుందని, ‘వోల్వో’ చరిత్రలో ఎక్స్ సీ90 టీ8 ఎక్స్ లెన్స్ హైబ్రిడ్ ఒక మైలురాయిలా నిలిచిపోతుందని వోల్వో ఆటో ఇండియా ఎండీ టామ్ బాండ్రూఫ్ అన్నారు.

  • Loading...

More Telugu News