: 500వ టెస్టు ఘనతను ఘనంగా నిర్వహించనున్న బీసీసీఐ...ఐసీసీకి నో ఎంట్రీ
న్యూజిలాండ్ తో ఈ నెల 22న కాన్పూర్ లో జరగనున్న టెస్టు మ్యాచ్ తో టీమిండియా టెస్టుల్లో మొత్తం 500 టెస్టులు ఆడిన ఘనతను సొంతం చేసుకోనుంది. దీనిని పురస్కరించుకుని ఈ టెస్టును వేడుకగా ఆరంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మైలురాయిని ఎప్పటికీ గుర్తుంచుకునేలా నిర్వహించాలని భావిస్తోంది. మామూలుగా ఇలాంటి వేడుకలకు ఐసీసీ ప్రతినిధిగా ఎవరినైనా బీసీసీఐ గతంలో ఆహ్వానించేది. బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శశాంక్ మనోహర్ ఇటీవల ఐసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన తరువాత బీసీసీఐ నిర్ణయాలను ఆయన అడ్డుకుంటున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధికారాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఐసీసీ చీఫ్, ఐసీసీ సీఈవోలకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బీసీసీఐ ఎలాంటి ఆహ్వానం పంపకపోవడం విశేషం.