: బెంగళూరులోని 16 పోలీస్‌స్టేష‌న్ల ప‌రిధిలో క‌ర్ఫ్యూ ఎత్తివేత.. నిషేధాజ్ఞ‌లు కొన‌సాగింపు


కావేరి జ‌లాల పంపిణీపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో బెంగళూరులో వాతావ‌ర‌ణం అగ్నిగుండంగా మారిన నేప‌థ్యంలో ఆ ప్రాంతంలోని 16 పోలీస్ స్టేష‌న్ల ప‌రిధిలో పోలీసు అధికారులు క‌ర్ఫూ విధించిన సంగ‌తి తెలిసిందే. ప‌రిస్థితి ఇప్పుడు కాస్త చ‌ల్ల‌బ‌డ్డ నేప‌థ్యంలో ఈరోజు క‌ర్ఫ్యూను ఎత్తివేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. ఈరోజు ఉద‌యం అక్క‌డి వాతావ‌ర‌ణం ప్ర‌శాతంగా క‌నిపించింది. క‌ర్ఫ్యూ ఎత్తివేస్తున్న‌ప్ప‌టికీ ఆయా ప్రాంతాల్లో విధించిన నిషేధాజ్ఞ‌లు మాత్రం కొన‌సాగుతాయ‌ని అధికారులు తెలిపారు. క‌ర్ణాట‌క వ్యాప్తంగా చెల‌రేగిన‌ హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి.

  • Loading...

More Telugu News