: ఆధార్, ఓటర్, పాన్ కార్డులుంటే నాలుగు రోజుల్లో పాస్ పోర్ట్


ఆధార్ కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డులుంటే కేవలం నాలుగు రోజుల్లోనే పాస్ పోర్టు పొందవచ్చని చెన్నై పాస్ పోర్టు కార్యాలయాధికారి బాలమురుగన్ తెలిపారు. చెన్నైలోని అడయార్ లో ఉన్న పాస్ పోర్టు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, పాస్ పోర్టును సత్వరమే పొందేందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టామని అన్నారు. పాస్ పోర్టు దరఖాస్తులను పోలీసులు పరిశీలించేందుకు వీలుగా ఉండేలా ప్రత్యేకంగా యాప్ ను రూపొందించినట్టు ఆయన తెలిపారు. ఈ యాప్ సాయంతో చెన్నై, కడలూరు, విల్లుపురంలలో పోలీసులు తనిఖీలు చేస్తారని ఆయన వెల్లడించారు. తమిళనాడులోని 280 ఈ సేవా కేంద్రాల నుంచి పాస్ పోర్టు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. గత ఏడాది 4 లక్షల పాస్ పోర్టులను జారీ చేయగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 3 లక్షల పాస్ పోర్టులను జారీ చేసినట్టు తెలిపారు. పాస్ పోర్టు దరఖాస్తు పరిశీలన సమయాన్ని 19 రోజుల నుంచి కేవలం 2 రోజులకు తగ్గించినట్టు ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News