: రియో పారా ఒలింపిక్స్ లో భారత్ కు రెండో స్వర్ణం
రియో పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణపతకం వచ్చి చేరింది. అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న ఆటగాళ్లు సాధించలేని ఘనతను దివ్యాంగులు సాధించి దేశ పరువు ప్రతిష్ఠలు ఇనుమడింపజేస్తున్నారు. హైజంప్ లో తమిళనాడుకు చెందిన ఆటగాడు భారత్ కు రియో పారా ఒలింపిక్స్ లో తొలి స్వర్ణ పతకం సాధించగా, తాజాగా జావెలిన్ త్రోలో దేవేంద్ర ఝుఝురియాకు స్వర్ణ పతకం వచ్చింది. 63.97 మీటర్ల దూరం జావెలిన్ ను విసిరిన ఝుఝురియా ఇప్పటి వరకు జావెలిన్ త్రోలో భారత ఆటగాళ్లు ఎవరూ చేయలేని ప్రదర్శనను చేయడం విశేషం. కాగా, ఈ పతకంతో రియో పారా ఒలింపిక్స్ లో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది.