: నాన్నా... పండగ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం!: జూనియర్ ఎన్టీఆర్ తో కల్యాణ్ రామ్


‘నాన్నా.. పండగ చేసుకుందాం, పార్టీ చేసుకుందాం’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తూ నటుడు కల్యాణ్ రామ్ అన్న డైలాగ్ లకు చప్పట్లు మార్మోగాయి. 'జనతా గ్యారేజ్' చిత్రం సక్సెస్ మీట్ హైదరబాద్ లో ఈ సాయంకాలం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హాజరైన కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ‘మీ ఆకలి తీరింది. నాది, నా తమ్ముడి ఆకలి తీరింది. మీ అందరూ మా ఆకలి తీర్చారు. గూబ గుయ్యి మనేలా సూపర్ హిట్ ఎప్పుడు కొడతామని గత మూడేళ్లుగా ప్రతిరోజూ, ప్రతిసారి నేను, నా తమ్ముడు తారక్ అనుకునేవాళ్లం. ఈసారి కుదిరింది. కొడితే ఎలా ఉంటుందో, మీ అందరూ చూపించారు. మొన్న తారక్ చెప్పిన విషయాన్నే నేను మళ్లీ చెబుతున్నాను.. మా నాన్నగారి షష్టి పూర్తికి ఈ చిత్రం విజయాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు’ అని కల్యాణ్ రామ్ అన్నాడు.

  • Loading...

More Telugu News