: చంద్రుడిపై ఆస్ట్రోనాట్ తో ఆడుకున్న ఉంగరం... 'అపోలో-16' నాటి ఆసక్తికర ముచ్చట!


ఉంగరం ఎక్కడైనా మనుషులను వెతుక్కుంటూ వస్తుందా? రాదు కదా? నిజమే. కానీ చంద్రుడి మీద అలా వచ్చింది. ఆ ఆసక్తికరమైన విషయంలోకి వెళితే... 1972లో అపోలో-16 మిషన్‌ ప్రయోగం జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 16న ఈ వ్యోమనౌకలో 11 రోజుల ప్రయోగంలో భాగంగా ముగ్గురు వ్యోమగాములు జాన్‌ యంగ్‌, థామస్‌ మాట్టింగ్లి 2, ఛార్లెస్‌ డ్యూక్‌ జూనియర్‌ లు ప్రయాణమయ్యారు. విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపి నాసా నిర్దేశించిన పనులు చేస్తుండగా, వారు వెళ్లిన రెండో రోజు థామస్ మాట్టింగ్లి 2 తన వివాహ సందర్భంగా తన భార్య ఎంతో ప్రేమగా తన చేతికి తొడిగిన ఉంగరాన్ని పోగొట్టుకున్నాడు. అసలే సెంటిమెంట్లు కలిగిన తన భార్యకు ఈ విషయం తెలిస్తే బాధపడుతుందని, అలా జరగకూడదని ఉంగరం ఎక్కడ పోగొట్టుకున్నాడో వెతకాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నాసా అప్పగించిన పనులు పూర్తి చేస్తూనే, మరోపక్క ఉంగరం గురించి వెతకడం మొదలుపెట్టాడు. అతని ప్రయత్నం చూసి, మిగిలిన ఇద్దరు వ్యోమగాములు కూడా అతనితో పాటు వెతకడం ప్రారంభించారు. అయినా ఎలాంటి ఫలితం లేదు. దీంతో ఈ ముగ్గరూ ఉంగరం పోయిందని నిర్ణయానికి వచ్చి, తమ పనుల్లో నిమగ్నమైపోయారు. ఈ ఘటన జరిగిన తొమ్మిదో రోజున ఆ ఉంగరం వ్యోమనౌక వద్ద ఎగురుతూ ప్రత్యక్షమైంది. దానిని అందుకునేంతలో అది మరింత దూరం జరగడంతో తన హెల్మెట్ వినియోగించి ఉంగరాన్ని ఒడిసిపట్టేశాడు. అతను తిరిగి ఉంగరం పొొందితే, ఛార్లెస్ తన భార్యా బిడ్డల ఫోటోను మాత్రం చంద్రుడి మీదే వదిలేసి, భూమిమీదకి వచ్చేశాడు. ఈ విషయాన్ని ఛార్లెస్ స్వయంగా వెల్లడించాడు.

  • Loading...

More Telugu News