: క్వికర్, ఓఎల్ఎక్స్ లో మేకలు ప్రత్యక్షం... ధర రూ.15 లక్షలు


క్వికర్, ఓఎల్ఎక్స్ వేదికల గురించి ఆన్ లైన్ ప్రియులకు తెలిసే ఉంటుంది. అన్ని రకాల వస్తువుల విక్రయాలకు ఇవి వేదికగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో బక్రీద్ పండుగకు ముందు ఈ సైట్లలో మేకలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ధరలు చూస్తే గుండె జారి పోవాల్సిందే మరి. ఈ సైట్లలో మేకల ఫొటోలను పోస్ట్ చేస్తే.... మేక రూపు రేఖలను దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో లక్షల మంది చూడడం ద్వారా మంచి రేటు వస్తుందని విక్రయదారుల ఆలోచన. గతేడాది వలే ఈ ఏడాది కూడా ఢిల్లీకి చెందిన షకీల్ అన్సారీ తోతాపురి అనే మేకను విక్రయానికి పెట్టాడు. దీని ధర రూ.5 లక్షలు. రెండు సైట్లలోనూ ప్రకటనలను పోస్ట్ చేయగా మంచి స్పందన వచ్చినట్టు అతడే స్వయంగా వెల్లడించాడు. తాను విక్రయానికి పెట్టిన మేక రెండు సంవత్సరాల వయసున్నదని, బరువు 140 కిలోలని తెలిపాడు. ఇక భోపాల్ కు చెందిన అర్షద్ అలీ సైతం నాలుగేళ్ల వయసున్న క్యోటా జాతికి చెందిన మేకను విక్రయానికి ఉంచాడు. మరో వ్యక్తి రాజస్థాన్ జాతికి చెందిన 150 కిలోల మేకను రూ.3.5 లక్షల ధరతో అమ్మకానికి పెట్టాడు. ఓఎల్ఎక్స్ లో రూ.1,000 నుంచి రూ.15 లక్షల రూపాయల ధరల్లో మేకల విక్రయ ప్రకటనలు పోస్ట్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News