: 'రాజ‌కీయాలు ఎలా ఉండాలి?' అనే అంశంపై పుస్తకం రాస్తున్న పవన్ కల్యాణ్


‘నేను-మనం-జనం’ పేరుతో జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో పుస్తకం రాస్తున్నారు. ఆయ‌న ఇప్ప‌టికే ‘ఇజం’ పేరుతో ఓ పుస్త‌కాన్ని రాసి విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా రాస్తోన్న పుస్త‌కంలో రాజ‌కీయాలు ఎలా ఉండాలి? అన్న అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించ‌నున్నారు. ఈ పుస‌క్తంలోనే త‌న రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌పై ప‌వ‌న్ స్పష్టత ఇవ్వ‌నున్నారు. జ‌నం మ‌నం పుస్తకం ట్యాగ్‌లైన్‌గా ‘మార్పు కోసం యుద్ధం’ అని పెట్ట‌నున్నారు. మ‌రో రెండు నెలల్లో ఈ పుస్త‌కం విడుద‌ల కానుంది. పుస్త‌కం ద్వారా జ‌న‌సేన సిద్ధాంతాల‌పై క్లారిటీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఇజంలో కంటే మ‌రింత క్లారిటీగా ప‌లు అంశాల‌ను ఈ పుస్తకం ద్వారా ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించ‌నున్నారు. ఇటీవ‌లే తిరుప‌తి, కాకినాడ‌ల్లో స‌భ‌లు నిర్వ‌హించిన ఆయ‌న కొన్నాళ్లు త‌న స‌భ‌ల‌కు బ్రేక్ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌త ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న ఓపక్క 'కాటమరాయుడు' సినిమా చేస్తూనే, మరోపక్క త‌న కొత్త పుస్త‌క ర‌చ‌న ప‌నిలో బిజీబిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News