: నా అనారోగ్యం పెద్ద విషయం కాదు: హిల్లరీ క్లింటన్


9/11 దాడులు జరిగి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గ్రౌండ్ జీరో వద్ద నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న అమెరికా అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, న్యూమోనియాతో బాధపడే తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అనారోగ్యానికి గురికావడం పెద్ద విషయం కాదని పేర్కొన్నారు. తీరిక లేకుండా ప్రచారంలో చురుగ్గా పాలుపంచుకునేటప్పుడు స్వల్ప అస్వస్థతకు గురవ్వడం సహజమని, కొంచెం విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రచారంలో పాల్గొంటానని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News