: స్విస్ చాలెంజ్ పై సుప్రీంకు వెళ్తాం: డిప్యూటీ సీఎం కేఈ


రాజధాని అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి ‘స్విస్ చాలెంజ్’ విధానంలో సింగపూర్ కన్సార్టియం దాఖలు చేసిన ప్రతిపాదనకు బిడ్ ల ఆహ్వానంపై తదుపరి చర్యలను నిలిపివేస్తూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. రాజధాని విషయంలో ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవమన్నారు. కర్నూలులో ఈ రోజు కేఈ కృష్ణమూర్తి ఈ విషయమై విలేకరులతో మాట్లాడుతూ... అమరావతిని నంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటించడం సీఎం చంద్రబాబు ఘనతగా పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారారని విమర్శించారు.

  • Loading...

More Telugu News