: చట్టాన్ని అతిక్రమించి ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదు: నరేంద్ర మోదీ
చట్టాన్ని అతిక్రమించి ముందుకెళ్లడం మంచి పద్ధతి కాదని కర్ణాటక-తమిళనాడు ప్రజలకు ప‌్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన ఉద్రిక్త వాతావరణంపై ఆయన ఈరోజు స్పందిస్తూ.. దాడులతో సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించడం వల్ల సమస్య పరిష్కారం కాదని ఆయన సూచించారు. దేశ సమైక్యత కోసం పాటు పడే బాధ్యత గల పౌరులుగా ప్రజలు నడుచుకోవాలని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి హింస మార్గం కాదని సూచించిన ఆయన.. చర్చలతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని చెప్పారు. కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి నీటి వివాదం సున్నిత అంశమని పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాన్ని న్యాయపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు.