: ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ‘యోలో, ఊంపా లూంపా’... వెయ్యి కొత్త పదాలకు చోటు
యోలో... ఊంపా లూంపా... ఏంటివి అని అనుకుంటున్నారా..? ఆక్స్ ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో తాజాగా చేరిన కొత్త పదాలు. ఇవే కాదు. ఇలాంటివే వెయ్య పదాలను కొత్తగా చేర్చి తాజా త్రైమాసిక డిక్షనరీని విడుదల చేశారు. హ్యుమన్ బీయింగ్ అనే పదం గురించి వినే ఉంటారు. మనిషి అనే సంబోధనకు హ్యుమన్ బీయింగ్ అని చెబుతారు. కానీ, ఈ పదం కొత్త రూపం సంతరించుకుని హ్యూమన్ బీన్ అని తాజా ఆక్స్ ఫర్డ్ ఎడిషన్ కు ఎక్కింది. హ్యూమన్ బీయింగ్ పదాన్ని తప్పుగా ఉచ్చరించడం వల్ల ఏర్పడిన హాస్యపూరిత ప్రత్యామ్నాయ పదమే హ్యూమన్ బీన్ అని ఆక్స్ ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ సోనాదన్ డెంట్ తెలిపారు. ఇంకా క్లిక్ టివిజమ్, స్లాకివిజమ్, స్లాకివిస్ట్, క్లిక్ టివిస్ట్, స్ప్లెండిఫెరస్ తదితర పదాలు కూడా తాజా డిక్షనరీలో చోటు సంపాదించుకున్నాయి.