: నేటి మధ్యాహ్నం ప్రధానితో గవర్నర్ భేటీ
తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. నేటి మధ్యాహ్నం ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లో హైకోర్టు విభజన, తొమ్మిది, పదో షెడ్యూళ్లలోని సంస్థల విభజన, జల వివాదాలు సహా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అపరిష్కృత సమస్యలపై ఆయన చర్చించనున్నారు. ఇప్పటికే సమావేశానికి సిద్ధం కావాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు ఇచ్చిన ఆయన, కేంద్రంతో చర్చించిన అనంతరం వారిద్దరితో సమావేశం నిర్వహించనున్నారు. బక్రీద్ ను పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.