: ఏంటీ, అర్థం పర్థం లేని ఆరోపణలు.. రూ.115 కోట్లకు 208 కోట్ల అవినీతా?: ప్రతిప్తాటి ఫైర్


రెయిన్ గన్స్ వ్యవహారంలో వస్తున్న అవినీతి ఆరోపణలపై ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఫైరయ్యారు. రెయిన్ గన్స్‌ కోసం ప్రభుత్వం రూ.115 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ ఈ వ్యవహారంలో రూ.208 కోట్ల అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడంపై విరుచుకుపడ్డారు. పది రోజుల క్రితమే రెయిన్ గన్స్‌ను అందుబాటులో ఉంచితే మరిన్ని పంటలు పండే అవకాశం ఉండేదన్న మంత్రి, ఓ వ్యక్తి కోర్టుకు వెళ్లడం వల్ల ఆలస్యం జరిగిందన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుతో అసెంబ్లీ అంటేనే ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్ చరిత్ర హీనుడిగా మిగిలిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. స్విస్ చాలెంజ్‌పై విధించిన కోర్టు స్టేపై అప్పీలుకు వెళ్తామన్నారు.

  • Loading...

More Telugu News