: ఏపీలో కేంబ్రిడ్జి యూనివర్సిటీ?.. వర్సిటీ ప్రతినిధులతో సుజనా, గంటా చర్చలు


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. భారత‌దేశంలో తన ప్రధాన కార్యాలయాన్ని ఏపీలోని అమరావతిలో ఏర్పాటు చేయాలని వర్సిటీ ప్రతినిధులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ రవీంద్రబాబు తదితరులతో యూనివర్సిటీ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. వర్సిటీతోపాటు సెంటరాఫ్ ఎక్సలెన్సీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విషయాన్ని సమావేశం అనంతరం మంత్రి గంటా మీడియాకు తెలిపారు. అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుపై చర్చించినట్టు పేర్కొన్నారు. ఏపీని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పించారని, అందులో భాగంగానే కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రతినిధులతో సమావేశమైనట్టు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News