: భార్యను 'ఈబే'లో అమ్మకానికి పెట్టిన భర్త!


తాజాగా ఓ వ్యక్తి ఈకామర్స్ వెబ్‌ సైట్ ఈబేలో తన భార్యను అమ్మకానికి పెట్టాడు. బ్రిటన్ లోని వోక్ ఫీల్డ్ లోని యార్క్ షైర్ కు చెందిన ప్రాంక్ స్టార్ జోకెర్ సిమన్ ఓకనె (33) అనే వ్యక్తి తన భార్య లియాండ్రాను ఈబేలో అమ్మకానికి పెట్టాడు. ఈ సందర్భంగా తన భార్యను ఎందుకు విక్రయించాలనుకుంటున్నదీ, ఆమె వివరాలు పూర్తిగా పేర్కొన్నాడు. దీంతో రెండు రోజుల్లోనే ఆయనకు 65,880 పౌండ్ల బిడ్లు రావడం విశేషం. తన భార్య గురించి ఓకనే ఏమన్నాడంటే...‘‘ఫర్ సేల్ వన్ వైఫ్’’ అంటూ మొదలు పెట్టి లియాండ్రాకు దైవభక్తి అస్సలు లేదని, తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆమె కనీసం దైవపూజలు కూడా చేయలేదని, పైపెచ్చు తనను మాటలు, చేతలతో హింసిస్తోందనే అమ్మకానికి పెట్టానని తెలిపాడు. ఆమె గుణగణాల గురించి చెబుతూ, లియాండ్రా చక్కగా నవ్వుతుందని, జిమ్ వర్క్ చేయడంతో మరింత చక్కని బాడీ షేప్ ఆమె సొంతమని తెలిపాడు. వంటపనిలో ఆమెకు తిరుగులేదన్నాడు. ఎప్పుడూ లొడలొడ వాగుతుండడం ఆమెకున్న లోపమని చెప్పాడు. ఆమెను దక్కించుకున్నవాడు అదృష్టవంతుడని పేర్కొన్న సిమన్, ఆమె చాలా మంచిదని తెలిపాడు. ఇదే సమయంలో ఒకసారి అమ్మిన వస్తువు తిరిగి తీసుకోబడదని షరతు విధించాడు. ఈ భార్య సేల్ కు నెటిజన్ల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. కేవలం రెండు రోజుల్లోనే 65,880 పౌండ్ల బిడ్లు వచ్చాయి. అయితే, తనను అమ్మకానికి పెట్టాడని తెలుసుకున్న లియాండ్రా అతనిని చంపేస్తానని పేర్కొంది. ఇంతకీ ఈ వేలాన్ని సరదా కోసం పెట్టాడా? లేక సీరియస్సా? అనేది తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News