: రగులుతున్న తమిళనాడు, కర్ణాటక... 32 బస్సులను తగులబెట్టిన ఆందోళనకారులు


కావేరీ జల వివాదం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య రావణకాష్టంలా రగులుతోంది. నేటి ఉదయం తమిళనాడులోని కన్నడిగుల షాపులపై దాడులు జరగగా, ఈ సాయంత్రం ఆ ఆందోళనలు బెంగళూరుకు పాకాయి. తాజాగా తమిళనాడుకు చెందిన కేసీఎస్ ట్రావెల్స్ కు చెందిన ప్రైవేటుట్రావెల్స్ బస్సులకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మొత్తం 32 బస్సులను తగులబెట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు బెంగళూరుతోపాటు, వివిధ ప్రధాన పట్టణాల్లో తమిళులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. అలాగే రామేశ్వరం, సేలం, చెన్నైలోని కన్నడిగులు నివాసం ఉంటున్న వివిధ ప్రాంతాల్లో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల నుంచి కర్ణాటక వైపు వెళ్తున్న పలు లారీలు, బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ మేరకు తమ రాష్ట్ర వాసులకు రక్షణ కల్పించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోనాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News