: కోహ్లీ పైసా బయటకు తీయడు.. నెహ్రా కూడా అంతే: యువరాజ్ సింగ్


టీమిండియాలో అత్యంత పిసినారి స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీయేనని క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఒక రేడియో ప్రోగ్రామ్ లో సరదాగా ముచ్చటించి యువీ తన జట్టు సభ్యుల గురించి కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ తర్వాత బౌలర్ నెహ్రా కూడా పిసినారేనని చెప్పాడు. తాము కలిసి ఎప్పుడైనా బయటకు వెళ్లినప్పుడు నెహ్రా తన జేబులో నుంచి పైసా బయటకు తీసేవాడు కాదని, అతని జేబులో నుంచి డబ్బులు బయటకు తీయించడానికి తాను ఎంతో ప్రయత్నం చేశానని యువీ చెప్పుకొచ్చాడు. అయితే, తానెందుకు డబ్బులు ఖర్చు పెట్టడం లేదనే విషయాన్ని నెహ్రా చెప్పేవాడని అన్నాడు. తనకు భార్యా, పిల్లలు ఉన్నారని, అందుకే ఎక్కువగా ఖర్చు పెట్టలేనని నెహ్రా అనేవాడని యువీ గుర్తుచేసుకున్నాడు. టీం ఇండియాలో తనకంటే సీనియర్లు అయిన పలువురు ఆటగాళ్లలో కూడా చాలామంది పిసినార్లు ఉన్నారని యువీ చెప్పాడు. క్రికెట్ దిగ్గజం సచిన్, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ లు కూడా ఈ జాబితాలో ఉంటారా? అనే ప్రశ్నకు యువరాజ్ స్పందిస్తూ.. దాని గురించి వదిలేయాల్సిందేనని అన్నాడు.

  • Loading...

More Telugu News