: కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్‌ మృతి


అనంతపురం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ కన్నుమూశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈరోజు ఆయ‌న మృతి చెందారు. జిల్లాలోని గుడిపాల మండలం కొత్తపల్లి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును మినీవ్యాన్‌ ఢీకొన్న ప్ర‌మాద‌ంలో గోపీనాథ్ మరణించారు. ఘటనా స్థ‌లికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. గోపినాథ్ 40 ఏళ్లుగా కాంగ్రెస్‌లో ఉన్నారు. గ‌తంలో ఆయ‌న‌ ఉర‌వ‌కొండ నియోజ‌క వ‌ర్గం నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయ‌న మృతి ప‌ట్ల ప‌లువురు నేత‌లు సంతాపం తెలిపారు.

  • Loading...

More Telugu News