: తమను దేవుడే కాపాడాలంటున్న షహబుద్దీన్ బాధితులు
బీహార్ లో 11 ఏళ్ల జైలు శిక్ష అనంతరం రెండురోజుల క్రితం బెయిలుపై విడుదలైన మాజీ ఎంపీ షహబుద్దీన్ బాధితులు భయంతో వణికిపోతున్నారు. ముగ్గురు సోదరులు సతీష్, గిరీష్, రాజీవ్ రోషన్ లను హత్య చేసిన కేసులో ఆయనకు జీవిత ఖైదు పడిన సంగతి తెలిసిందే. షహబుద్దీన్ విడుదలైన తరువాత ఈ ముగ్గురి తల్లిదండ్రులు మీడియా ఎదుట వాపోయారు. తమ బిడ్డలను దారుణంగా హత్య చేసిన వ్యక్తి తిరిగి జైలు నుంచి రావడంతో తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను దేవుడే కాపాడాలని హతుల తల్లి కళావతీ దేవి వ్యాఖ్యానించారు. షహబుద్దీన్ విడుదలతో తమలో భయం పెరిగిందని, ఇక ఈ ప్రాంతంలో తాము నివాసం ఉండలేమని ఆమె భర్త చంద్రకేశ్వర్ తెలిపారు.