: సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’లో పాల్గొననున్న తృప్తి దేశాయ్‌.. ఒక్క షరతు పెట్టిన ఉద్యమకారిణి


భార‌త్‌లో లింగ‌భేద నిర్మూల‌న కోసం ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూ దేశంలోని ప‌లు ప్ర‌సిద్ధ ఆల‌యాల్లో మ‌హిళ‌ల ప్ర‌వేశం కోసం పోరాడుతోన్న భూమాత బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’లో పాల్గొన‌నున్నారు. ఈ షోలో ఇప్ప‌టివ‌ర‌కు సినిమా, టీవీ, మోడలింగ్‌ రంగాలకు చెందిన వారే పాల్గొన్నారు. అయితే షో రూపును మార్చిన నిర్వాహ‌కులు ఇత‌ర రంగాల‌కు చెందిన వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ షోలో పాల్గొనే అవకాశం తనకు వచ్చిందని తృప్తి దేశాయ్ తెలిపారు. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు తాను సానుకూల సంకేతాలే ఇచ్చిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. అయితే, ఆమె నిర్వాహ‌కులకు ఒక ష‌ర‌తు పెట్టారు. సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌ చేసే ఈ షోలో ఇప్ప‌టివ‌ర‌కు వాయిస్‌ ఓవర్ పురుషుడిదే ఉంటోంది. తాను ఈ షోలో పాల్గొనాలంటే స్త్రీ గొంతుతో వాయిస్‌ ఓవర్‌ పెట్టాల‌ని ఆమె కండిష‌న్ పెట్టార‌ట‌. ఆమె ష‌ర‌తుకు నిర్వాహ‌కులు కూడా అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. బిగ్‌బాస్‌ సీజన్- 10 ప్రసారాలు వ‌చ్చేనెల‌ 16 నుంచి ప్రారంభం కానున్నట్లు స‌మాచారం.

  • Loading...

More Telugu News