: పీఎఫ్ వడ్డీ విషయంలో ఈ ఏడాది స్వల్ప తగ్గింపు!


ఇప్పటిదాకా ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాదారులకు అందిస్తున్న వడ్డీలో కోత విధించేందుకు కేంద్రం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే... గతేడాది లభించిన వడ్డీ శాతంలో 0.2 శాతం మేర కోత పడనుంది. పీఎఫ్ పై గతేడాది 8.8 శాతం వడ్డీ అమలైంది. ఈ వడ్డీలో కోత విధించేందుకు రంగం సిద్ధం చేసిన కేంద్రం... ఈ ఏడాది దానిని 8.6 శాతానికి కుదించనుంది. గడచిన ఐదేళ్లలో పీఎఫ్ వడ్డీని తగ్గించే దిశగా నిర్ణయం వెలువడనుండటం ఇదే తొలిసారి. ప్రభుత్వ పొదుపు పథకాలకు అమలవుతున్న వడ్డీ రేట్లకు అనుగుణంగా పీఎఫ్ వడ్డీని కూడా సవరించాలని కేంద్ర కార్మిక శాఖను ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు వడ్డీ రేటు కోతకు సంబంధించి కార్మిక శాఖ తీసుకున్న నిర్ణయంపై ఈపీఎఫ్ఓ నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

  • Loading...

More Telugu News