: అయోధ్యలో జంతువధపై నిషేధం ఎత్తివేత.. బక్రీద్ సందర్భంగా నిర్ణయం


జంతువధకు దూరంగా ఉండే హిందువుల పవిత్ర స్థలం అయోధ్యలో జంతువధను ఎత్తివేశారు. బక్రీద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో ఏ రకమైన మాంసాన్ని అయినా అమ్మడం కానీ, వండడం కానీ నిషేధం. అలాగే పెళ్లిళ్లు, పార్టీల్లోనూ దీనిపై నిషేధం కొనసాగుతోంది. అయితే ఏడాది క్రితం బక్రీద్ సందర్భంగా ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. ఈ ఏడాది కూడా అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు అందకుండానే నిషేధాన్ని ఎత్తివేశారు. ఇరు మతాల మధ్య సరైన అవగాహన ఉంటే ఏదైనా సాధ్యమేనని ఓ అధికారి పేర్కొన్నారు. ‘‘మాంసం, బీఫ్ గురించి వివాదాలు తలెత్తుతున్న వేళ టెంపుల్ టౌన్ అయిన అయోధ్య మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ ఇరు మతాల వారు ఒకరి మతాచారాలను మరొకరు గౌరవిస్తారు’’ అని ఆయన పేర్కొన్నారు. ఆహారపు అలవాట్ల కారణంగా ఇటీవల హత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ అలాంటివి లేవని చెప్పేందుకు అయోధ్య చక్కని ఉదాహరణ అని స్థానికుడు జమాల్ అక్తర్ పేర్కొన్నారు. ఇక్కడ జంతువధపై నిషేధం కొనసాగుతున్నా ‘బక్రీద్’ సందర్భాల్లో ఎటువంటి భయం లేకుండా పండుగలు నిర్వహించుకుంటామని కార్పొరేటర్ అసద్ అహ్మద్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News