: మార్కెట్లోకి త్వరలో రాందేవ్ బాబా స్వదేశీ జీన్స్
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ వస్త్ర ప్రపంచంలోకి అడుగుపెట్టనుంది. యువతలో అధిక డిమాండ్ ఉన్న కారణంగా ‘స్వదేశీ జీన్స్’ ను ఆవిష్కరించనుంది. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ఆరంభంలో మార్కెట్లోకి ‘స్వదేశీ జీన్స్’ను ప్రవేశపెడతామని పతంజలి సంస్థ యజమాని, ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వెల్లడించారు. ఎఫ్ఎంసీజీ విభాగంలో సంస్థ రూ.50 లక్షల కోట్లు లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విదేశాల్లో కూడా తమ సంస్థ ఉత్పత్తులను విక్రయించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఇప్పటికే నేపాల్, బంగ్లాదేశ్ లో, మధ్యాసియాలో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యానన్నారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ లో కూడా యూనిట్లు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కెనడాకు ఎగుమతులు చేస్తామని, ఈ ఏడాదిలోనే వంట నూనెలను ఆవిష్కరిస్తామని రాందేవ్ బాబా చెప్పారు.