: కాపుల ప్రతిష్టను ముద్రగడ దిగజారుస్తున్నారు: చిన రాజప్ప


కాపుల ప్రతిష్టను ముద్రగడ పద్మనాభం దిగజారుస్తున్నారని ఏపీ డిప్యూటీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తుని ఘటనతో వైఎస్సార్సీపీ నాయకుడు భూమనకు సంబంధముందని ఆయన ఆరోపించారు. కాపు కులస్తులను బీసీల్లో చేర్చాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారన్నారు. 20 రోజుల్లో పల్స్ సర్వే పూర్తవుతుందని, ఆ సర్వే పూర్తి కాగానే మంజునాథ కమిషన్ పర్యటిస్తుందని చినరాజప్ప పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News