: పవన్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదు: ఎంపీ హరిబాబు
భారతీయ జనతా పార్టీ ఏపీ ప్రజల పొట్టలో పొడిచిందంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ ఏపీ ప్రజల పొట్టలో పొడవలేదని, పొట్ట నింపుతోందని అన్నారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్ తో యువత కడుపు నింపుతామని చెప్పారు. ప్రత్యేక ఆంధ్రా ఉద్యమానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఈ సందర్భంగా మరోనేత కావూరి సాంబశివరావు మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదాకు మించి కేంద్రం సాయం చేసిందన్నారు.