: సమాజ్ వాది పార్టీలో చేరిన క్రికెటర్ ప్రవీణ్ కుమార్


భారత క్రికెటర్ ప్రవీణ్ కుమార్ రాజకీయ తీర్థం పుచ్చుకున్నారు. సమాజ్ వాది పార్టీ (ఎస్పీ)లో చేరారు. ఈరోజు లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ స్వయంగా ప్రవీణ్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, టీమిండియా తరపున ప్రవీణ్ కుమార్ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇప్పటి వరకు 6 టెస్టులు, 68 వన్డే మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 27 వికెట్లు, వన్డేల్లో 77 వికెట్లు తీసుకున్నాడు. వీటితో పాటు 10 టీట్వంటీ మ్యాచ్ లలో 8 వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రవీణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

  • Loading...

More Telugu News