: ప్యాకేజీపై చర్చిద్దామా?: పవన్ కల్యాణ్ కు బీజేపీ ఏపీ ఇన్ చార్జ్ సవాల్
వెంకయ్యనాయుడిని విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్ కు లేదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ సిద్ధార్థ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఎదిగే కొద్దీ ఒదగాల్సిన పవన్, దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్యాకేజీపై పవన్ సహా ఎవరితోనైనా తాను చర్చకు సిద్ధమని, ధైర్యముంటే తన సవాల్ ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. ఎన్డీయేలో జనసేన అన్న పార్టీయే లేదని, ఒకవేళ ఉంటే, ఎప్పుడు చేరిందన్న విషయాన్ని పవన్ ను అడగాలని సూచించారు. ఆయనకు పరిపాలనా అనుభవం లేదని ఆరోపించిన సిద్ధార్థ, రాష్ట్రానికి మేలు చేయాలని ఆలోచించే వెంకయ్యపై విమర్శలు సరికావని పవన్ కల్యాణ్ కు హితవు పలికారు.