: నాకు దెయ్యాలు, పాములంటే భయం: 'పెళ్లిచూపులు' హీరో విజయ్ దేవరకొండ
‘దెయ్యాలు, పాములు అంటే నాకు చాలా భయం’ అంటున్నాడు 'పెళ్లిచూపులు' హీరో విజయ్ దేవరకొండ చెప్పాడు. అంతేకాకుండా, హారర్ చిత్రాలు కూడా తాను చూడనని, ఆ చిత్రాల్లో నటించనని, అటువంటి చిత్రాలు చూసి నాలుగేళ్లయిందని అన్నాడు. ఒంటరిగా ఉండటమంటే తనకు ఇష్టముండదని, వెంటనే ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్లిపోతానని అన్నాడు. పదవ తరగతి వరకు పుట్టపర్తిలో చదువుకున్నానని, పదేళ్లపాటు ప్రతిరోజూ ఉదయం 5.30 గంటలకే క్రమం తప్పకుండా లేచే వాడినని చెప్పాడు. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత హైదరాబాద్ భద్రుకా కాలేజీలో బీకాం ఆనర్స్ చేశానని చెప్పాడు.