: ప్రజల్లోకి వచ్చి పోరాడు... నీ వెనుకే నడుస్తా: పవన్ కు ముద్రగడ ఆఫర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే దిశగా ఉద్యమాన్ని నడపాలని పవన్ కల్యాణ్ భావిస్తే, తామంతా ఆయన వెనుకే నడించేందుకు సిద్ధమని కాపు సామాజిక నేత ముద్రగడ పద్మనాభం వ్యాఖ్యానించారు. పవన్ ప్రజల్లోకి రావాలని, వీధి పోరాటాలకు దిగాలని పిలుపునిచ్చిన ముద్రగడ, ఆయన రంగంలోకి దిగితే, హోదా కోసం జరిగే పోరు కీలక మలుపు తీసుకున్నట్లవుతుందని ఏపీలోని జిల్లాల కాపు నేతలతో సమావేశమైన వేళ ఆయన వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాను చంద్రబాబునాయుడు ఢిల్లీలో తాకట్టు పెట్టారని ముద్రగడ విమర్శలు గుప్పించారు. కాపులను విడగొట్టి తన పబ్బం గడుపుకోవాలని భావిస్తున్న ఆయన పప్పులుడకవని వ్యాఖ్యానించారు. కాపులంతా రిజర్వేషన్ల కోసం ఏకతాటిపై ఉద్యమిస్తున్నారని, డిమాండ్లను సాధించుకునే సత్తా తమకుందని అన్నారు.