: చంద్రబాబు కాలర్ పట్టుకుంటే జగన్ చెయ్యి నరికేస్తాం: ఎమ్మెల్సీ వైవీబీ తీవ్ర హెచ్చరిక


ప్రత్యేక హోదా కోసం చంద్రబాబునాయుడి కాలర్ పట్టుకుని నిలదీస్తామని వైకాపా అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నేత, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు కాలర్ ను జగన్ పట్టుకుంటే, ఆ పట్టుకున్న చెయ్యిని నరికేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. అసెంబ్లీ వేదికపై ఉన్మాదిలా ప్రవర్తించి, గౌరవ ప్రతిష్ఠలను భ్రష్టు పట్టించిన జగన్, నోటిని అదుపులో పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, చూస్తూ ఊరుకోబోమని, నోరు అదుపులో పెట్టుకోకుంటే తగిన రీతిలో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News