: ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికమట!


ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువని తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో పురుషల కంటే వీరు మూడు రెట్లు అధికంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 15-30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఈ ఘటనలకు పాల్పడుతున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అంటే ప్రతీ 40 సెకెన్లకు ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే పురుషల కంటే మహిళలు 2.5-3శాతం రెట్లు ఎక్కువగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. అయితే ప్రాణాలు కోల్పోతున్న వారిలో మాత్రం మహిళల కంటే పురుషులు మూడు రెట్లు అధికంగా ఉన్నారు. 10-15 శాతం మంది మాత్రం క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. మరికొందరు మాత్రం ‘‘నేనిక జీవించడానికి పనికిరాను’’ అని ఊహించుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది ఇలాగే భావిస్తున్నారట. అటువంటి వారిని సకాలంలో గుర్తించడం వల్ల వారి ప్రాణాలు కాపాడవచ్చని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జి.ప్రసాద్‌రావు తెలిపారు. 1947లో స్థాపించిన ఈ సొసైటీ ఆత్మహత్యల నివారణకు ఎంతగానో కృషి చేస్తోంది. ఆత్మహత్యల వెనక ఉన్న కారణాల గురించి వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతోంది. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం కారణంగా ఆదివారం పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.

  • Loading...

More Telugu News